HomeTelugu Trendingఎన్టీఆర్‌పై సునిశిత్‌ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌పై సునిశిత్‌ సంచలన వ్యాఖ్యలు

sunisith comments on jr ntr

కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో సోషల్ మీడియాలో పాపులరయ్యాడు సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్నవారంతా తాను చేసిన త్యాగాల వల్లే అంతటివారయ్యారని అతను చెబుతుంటాడు. ఎస్.ఎస్.రాజమౌళి సైతం ‘బాహుబలి’ కథ ముందు తనకే చెప్పారని అంటాడు. ఇతడి చేసే ఓవరాక్షన్‌ను క్యాష్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానెళ్లు వరుసపెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూల్లో సునిశిత్ మ్యానరిజం, అతడు చెప్పే విషయాలు అందరికీ నవ్వు తెప్పిస్తాయి.

అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌పై, ఆయన భార్య ఉపాసనపై కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. దీంతో సునిశిత్‌ను కొంత మంది రామ్ చరణ్ అభిమానులు చితక్కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సునిశిత్‌ను చితక్కొట్టిన రామ్ చరణ్ ఫ్యాన్స్‌.. ఇంకెప్పుడూ సెలబ్రిటీలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా జరిగి రెండు రోజులు కూడా గడవకముందే యూట్యూబ్‌లో సునిశిత్ మరో ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాజా ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ గురించి సునిశిత్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. తాను ప్రభాస్‌కి ఫ్రెండునని.. ముంబై వెళ్లినప్పుడు తన రూమ్‌కి మందు బాటిల్ పంపమని ప్రభాస్‌కు ఫోన్ చేశానని సునిశిత్ చెప్పాడు. ప్రభాస్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ తనకు బాగా క్లోజ్ అని అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో అయినా ఆయనవి పోర్న్ ఫిలింస్ ఉన్నాయని బాంబ్ పేల్చాడు సునిశిత్. జూనియర్ ఎన్టీఆర్ పోర్న్ ఫిలింస్ చేసిన సీక్రెట్‌ను టాలీవుడ్‌లో సునిశిత్ అనే హీరో తప్ప ఎవ్వడూ చెప్పడని కోతలు కోశాడు. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇప్పటికే రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతిలో దెబ్బలు తిన్నాడు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో ఉంది.. సునిశిత్‌ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇలాంటి వాడితో.. ఇంటర్వ్యూలు చేసేవాళ్లను చితక్కొట్టాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇది ఎక్కడి వరకూ వెత్తుందో చూడాలి.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu