HomeTelugu Trending'సరిలేరు నీకెవ్వరు'లో కృష్ణ స్పెషల్‌ ఎంట్రీ..?

‘సరిలేరు నీకెవ్వరు’లో కృష్ణ స్పెషల్‌ ఎంట్రీ..?

7 5
ప్రముఖ నటుడ.. మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా జనవరి 11 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నిన్నటి రోజున ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ రావడంతో హైలైట్‌గా మారింది. ఇదే ఈవెంట్ లో సరిలేరు నీకెవ్వరూ సినిమాకు సంబంధించిన ట్రైలర్ భారీ రెస్పాన్స్ వచ్చింది.

భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక పక్కా కామెడీ ఎంటర్టైనర్ కావడం సినిమాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఎందుకంటే కామెడీ ఎంటర్టైనర్ అంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తుంటారు. ఇకపోతే, ఇందులో కృష్ణ ఓ స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ స్పెషల్ ఎంట్రీ ఎలా ఉంటుంది. ఎలా ఉండబోతుంది అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. చాలా కాలం తరువాత మహేష్ బాబుతో కలిసి కృష్ణ నటిస్తున్నారు. అందులో ఈ సినిమాలో స్పెషల్ ఎంట్రీ. అంతేకాదు, ఈ సినిమా ద్వారానే విజయశాంతి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇన్ని ఎంట్రీల మధ్య సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu