జిగేల్ జిగేల్ మనిపించే డ్రెస్ తో సన్నీలియోన్ ఫొటో వైరల్

సన్నీలియోన్ రీసెంట్ గా జిగేల్ జిగేల్ మనిపించే డ్రెస్ తో కూడిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. సన్నీలియోన్ కొత్త ఫోటో కోసం నిత్యం ఎదురు చూసే యువత.. ఆ ఫోటోను లైక్ లు షేర్స్ తో వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో దూసుకుపోతున్న నటి సన్నీలియోన్ కేవలం ఒక్క బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా సౌత్ లోకూడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. తెలుగులో రెండు స్పెషల్ సాంగ్స్ చేసిన సన్నీలియోన్ తమిళంలో రెండు మూడు సినిమాలు చేసింది. అటు మలయాళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ప్రస్తుతం సౌత్ లో సన్నీలియోన్ వీరమాదేవి సినిమా చేస్తోంది.

ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో సౌత్ లోని అన్ని భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలు చేస్తూనే సోషల్ కార్యక్రమాల్లో కూడా బిజీ అయ్యింది సన్నీలియోన్. మరోవైపు స్టార్ స్టక్ పేరుతో సౌందర్య ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. నటిగా, సామాజిక కార్యకర్తగా, బిజినెస్ విమెన్ గా బహుముఖ పాత్ర పోషిస్తోంది.