HomeTelugu Trending'మహిళా లోకం' సినిమాతో సురేఖ వాణి కూతురు టాలీవుడ్‌ ఎంట్రీ

‘మహిళా లోకం’ సినిమాతో సురేఖ వాణి కూతురు టాలీవుడ్‌ ఎంట్రీ

Surekha vani daughter supri

టాలీవుడ్‌ నటి సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ ఉంది. తల్లితో కలిసి సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. గ్లామరస్‌ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ మరింత ఫాలోయింగ్‌ పెంచుకుంటున్న సుప్రిత త్వరలోనే టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వనుంది.

ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్,ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులర్‌ అయిన సుప్రిత ఈ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది. కార్తీక్-అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ‘మహిళా లోకం’ అనే సినిమాలో నటించనుంది. మంచు లక్ష్మీ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుంది. శుక్రవారం ఈ సినిమా పోస్టర్‌ని విడుదల చేసిన మంచు లక్ష్మీ మూవీ టీం అందరికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. కాగా ఈ సినిమాలో సుప్రీతతో పాటు హరితేజ, హేమ, శ్రద్దాదాస్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

https://www.instagram.com/p/CdNpw6vrNpF/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!