డ్యూయల్ రోల్ చేయనున్న తమిళ స్టార్‌ హీరో!

తమిళ స్టార్ హీరో విజయ్ తన 63వ చిత్రాన్ని అట్లీ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. వాటిలో ఒకటి యుక్త వయసులో ఉండే పాత్ర కాగా మరోకటి వయసు మళ్ళిన పాత్ర. ప్రస్తుతం వయసు మళ్ళిన పాత్రపైనే షూటింగ్ జరుగుతోంది. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.