HomeTelugu Trendingబ్రహ్మాజీ తనయుడు హీరోగా గుట్టు చప్పుడు

బ్రహ్మాజీ తనయుడు హీరోగా గుట్టు చప్పుడు

Guttu Chappudu

నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావ్‌ హీరోగా ‘గుట్టు చప్పుడు’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారా మణీంద్రన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని లివింగ్‌ స్టన్‌ నిర్మిస్తున్నారు. సంజయ్‌ రావ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ను సంతోషం స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్‌ రావ్‌ మాట్లాడుతూ ‘‘పక్కా మాస్‌ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘గుట్టు చప్పుడు’ సినిమా నాకు చాలా మంచి ఇమేజ్‌ తెస్తుంది’’ అన్నారు. ‘‘వైజాగ్‌ నేపథ్యంలో కథ ఉంటుందని దర్శకుడు మణీంద్రన్ తెలిపాడు. నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా, ముఖ్యంగా యువత లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపాడు. నిర్మాత లివింగ్‌ స్టన్‌ మాట్లాడుతూ ‘‘నేను, మణీంద్రన్‌ చాలా కాలంగా ఫ్రెండ్స్‌. మా కాంబినేషన్‌లో సినిమా చేయాలను కున్నప్పుడు ‘గుట్టు చప్పుడు’ కథ బాగా నచ్చింది. ఇంకా రెండు షెడ్యూల్స్‌ మిగిలి ఉన్నాయని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu