HomeTelugu Trendingఓటీటీలో సూర్య 39వ సినిమా

ఓటీటీలో సూర్య 39వ సినిమా

suriya 39 movie jai bhim on

తమిళ హీరో సూర్య చిత్రం ‘జై భీమ్‌’ని నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో నవంబరు నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. నవంబర్ నెలలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. టి.ఎస్‌.జ్ఞానవేల్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య గిరిజనుల తరఫున పోరాడే న్యాయవాదిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. రజిషా విజయన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాశ్‌ రాజ్‌, మణికందన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీన్‌ రోల్డాన్‌ సంగీతం అందిస్తున్నారు. సూర్య ఇది 39వ చిత్రం. ఈ సినిమాతోపాటు సూర్య-జ్యోతిక నిర్మించిన ‘ఓ మై డాగ్‌’ (తెలుగు, తమిళం), ‘ఉడన్‌పిరప్పే’ (తెలుగు, తమిళం), ‘రామే రావనే’ (తమిళం) చిత్రాలూ అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu