HomeTelugu Trendingస్యూర పుట్టినరోజు.. ఇంటి ముందు ఫ్యాన్స్‌ సందడి

స్యూర పుట్టినరోజు.. ఇంటి ముందు ఫ్యాన్స్‌ సందడి

7 21కోలీవుడ్‌, టాలీవుడ్‌ మంచి నటుడిగా గుర్తింపు పొందిన హీరో సూర్య. ఆయన మంగళవారం 44వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సూర్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లు చేశారు. ఆయన మంచి మనసును గుర్తు చేసుకున్నారు. నగ్మా, రాధిక, దేవిశ్రీ ప్రసాద్‌, సెల్వరాఘవన్‌, మనోబాలా తదితరులు విష్‌ చేసిన వారిలో ఉన్నారు.

నగ్మా: పుట్టినరోజు శుభాకాంక్షలు సూర్య. నీ జీవితం సంతోషం, శాంతితో నిండాలని కోరుకుంటున్నా.
దేవిశ్రీ ప్రసాద్‌: ప్రియమైన బ్రదర్‌కు సూపర్‌ మ్యూజికల్‌ హ్యాపీ బర్త్‌డే. ఇలానే నీ సింప్లిసిటీతో మంచి పనులు చేస్తూ మరిన్ని బ్లాక్‌బస్టర్స్‌ అందుకో బ్రదర్‌.
రాధిక: చిత్ర పరిశ్రమకు చెందిన అద్భుతమైన వ్యక్తి, శ్రమించే నటుడు సూర్యకు హ్యాపీ బర్త్‌డే.
మనోబాలా: బెస్ట్‌ విషెస్‌ తంబీ.
సెల్వరాఘవన్‌: సూర్య సర్‌.. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. మీరు సూపర్‌ నటుడు, అద్భుతమైన వ్యక్తి. మీ జీవితం సంతోషంతో నిండాలని కోరుకుంటున్నా.
పాండిరాజ్‌: ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలి సూర్య సర్‌. మంచి ఆలోచనలు, ఆచరణతో ఎప్పుడూ ఇలానే ఉండండి.
రితేష్‌ దేశ్‌ముఖ్‌: హ్యాపీ బర్త్‌డే డియర్‌ సూర్య. ఆ దేవుడు నీకు సంతోషం, ప్రేమ, విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఇలాగే ఎప్పుడూ ప్రేక్షకులకు వినోదం పంచుతూనే ఉండు.
హరిచరణ్‌: పుట్టినరోజు శుభాకాంక్షలు సూర్య సర్‌.
మరోపక్క పుట్టినరోజున తమ అభిమాన హీరోను చూసి, విష్‌ చేయాలనే ఉద్దేశంతో సూర్య ఇంటి ముందు ఫ్యాన్స్‌ గుమిగూడారు. ఆయన కోసం ఎదురుచూశారు. దీంతో ‘సింగం’ ఇంటి నుంచి బయటికి వచ్చారు. ఫ్యాన్స్‌ను పలకరించి, షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu