సంక్రాంతి బరిలో భారీ చిత్రాల నడుమ అఖిల్‌ మజ్ను

అక్కినేని నటవారసుడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు కూడ బాగా పెరిగాయి.

చిత్ర నిర్మాతలు సినిమాను 2019 సంక్రాంతి బరిలోకి దింపాలని మూవీ యూనిట్‌ భావిస్తున్నారట. ఇప్పటికే సంక్రాంతికి ‘ఎన్టీఆర్’, రామ్ చరణ్-బోయపాటిల చిత్రం, ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాలు విడుదలకానున్నాయి. ఈ భారీ పోటీ నడుమ అఖిల్ సినిమా రిలీజ్ కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటెర్టైనర్లో నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమాలో సినియర్‌ నటి కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రలో నటిస్తుంది.