HomeTelugu Trendingసూర్య బందోబస్త్ కేవలం సినిమా కాదు..!

సూర్య బందోబస్త్ కేవలం సినిమా కాదు..!

7 10

సూర్య హీరోగా నటిస్తున్న బందోబస్త్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు భారీ ఎత్తున హైదరాబాద్‌లో జరిగింది. సూర్య సినిమాలకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్నది. కెవి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్య, సాయేషా తదితరులు నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈసినిమాలో సూర్య వివిధ గెటప్‌లలోకనిపించనున్నాడు. ఈ సినిమాకు సుభాస్కరన్ నిర్మాత. సెప్టెంబర్ 20 వ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చాలా రోజుల తర్వాత తాను చేసిన పెద్ద ప్రాజెక్టు ఈసినిమా అని సూర్య చెప్పాడు. ఈ సినిమా కథ కోసం దర్శకుడు ఎన్నో పరిశోధనలు చేశారని తెలిపారు. వ్యక్తిగతంగా దేశాన్ని చూడటం వేరు.. ఓ అధికారిగా దేశాన్ని చూడటం వేరని సూర్య అన్నారు. ఈ సినిమా వల్ల మన దేశాన్ని మరో కోణంలో చూడగలిగానని అన్నారు. మన భద్రతా సిబ్బంది తన ప్రాణాలను పణంగా పెడతారని, వాళ్లకు మనం గౌరవం ఇవ్వాలని అన్నారు. మోహన్‌ లాల్ వంటి గొప్ప నటుడితో పనిచేయాలన్న నా కల నెరవేరిందని సూర్య అన్నారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉందని అన్నారు. బందోబస్త్ కేవలం ఒక సినిమా కాదు.. మనకు దేశం, భద్రత గురించి అవగాహన కల్పిస్తుందని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu