HomeTelugu Trending10 భాషల్లో కంగువ టైటిల్‌తో వస్తున్న సూర్య

10 భాషల్లో కంగువ టైటిల్‌తో వస్తున్న సూర్య

Kanguva glimpse
తమిళ హీరో సూర్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా కంగువ. ఇప్పుడు సూర్య అభిమానులంతా ‘కంగువ’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

కంగువ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ తాజాగా విడుదల చేశారు. ఇవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మూవీలో సూర్య డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు. మరో 2 నెలల్లో ఈ సినిమా షూటింగు పార్ట్ పూర్తికానుంది.

Kanguva glimpse2

తమిళంలో ‘కంగువ’ అంటే అగ్నిలా దేనినైనా దహించే శక్తి కలిగినవాడు, అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. కథకి తగిన టైటిల్ అనే అనిపిస్తోంది. ఈ సినిమాను 10 భాషల్లో ఇదే టైటిల్‌తో విడుదల చేయనున్నారు.

సూర్య సరసన దిశా పటాని హీరోయిన్‌. ఇంకా బాబీ డియోల్, జగపతిబాబు, యోగిబాబు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu