HomeTelugu Trendingమహేష్‌ 'పాల పిట్ట' సాంగ్‌తో డేవిడ్‌ వార్నర్‌

మహేష్‌ ‘పాల పిట్ట’ సాంగ్‌తో డేవిడ్‌ వార్నర్‌

David warner dance for mahe

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తెలుగు సినిమా హీరోల డైలాగ్‌ చెప్పి భారత సీనీ ప్రియుల మనసును దోచుకున్నాడు. తర్వాత రూటు మార్చి రీఫేస్‌ యాప్‌ను ఉపయోగించి అమితాబ్, బాహుబ‌లిలో ప్ర‌భాస్‌, మ‌హ‌ర్షిలో మహేశ్‌బాబు, ‘ఆచార్య’లో చిరంజీవికి సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను రీఫేస్ చేసి ఆ వీడియోల‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

తాజాగా మహేష్‌బాబు సినిమా పాటకు స్టెప్పులేశాడు. మహేష్‌ నటించిన ‘మహర్షి’ సినిమాలోని ‘పాల పిట్ట’ సాంగ్‌ ఎంత ఫేమస్‌ అయిందో తెలిసిందే. ఈ పాటను రీఫేస్‌ యాప్‌తో ఛేంజ్‌ చేసి మహేష్ బాబు వేసిన స్టెప్పులు వార్నర్‌ వేసినట్లుగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

https://www.instagram.com/p/CK_CEUalvy5/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu