HomeTelugu Trendingబాలీవుడ్‌కు 'సూర్య' కొత్త సినిమా?

బాలీవుడ్‌కు ‘సూర్య’ కొత్త సినిమా?

1 24

ప్రముఖ నటుడు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘సూరరై పోట్రు’. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తుంది. ఊర్వశి, మోహన్‌బాబు, జాకీష్రాఫ్‌, కరుణాస్‌ ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు. ఇటీవలే ఈ సినిమా సింగిల్‌ ట్రాక్‌ను విమానంలో విహరిస్తూ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా ఈ చిత్రం విడుదలవుతోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గునీత్‌ మోంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్‌కు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. నటీనటులు, ఇతర సాంకేతిక కళాకారుల ఎంపిక పనులు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu