అదిరిపోయే బిజినెస్‌తో కాజల్‌ అగర్వాల్‌!

టాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు హీరోయిన్ గా చలామణి అవుతున్న నటి కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం సినిమా వచ్చి పదేళ్లు దాటిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించకపోయినా.. కాజల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత వరసగా హిట్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోలతో నటిస్తూ దూసుకుపోయింది. ఇప్పటికి ఆమె సినిమాలకు డిమాండ్ ఉన్నది అంటే అర్ధం చేసుకోవచ్చు.

ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు యాడ్స్ లో నటిస్తూ.. షాపింగ్ మాల్స్ వగైరా వగైరా ఓపెనింగ్ చేస్తూ బిజీగా ఉన్న కాజల్ గతంలో కొన్ని రకాల బిజినెస్ లు స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే మరో కాజల్ ముంబైలో ఓ నగల దుకాణాన్ని ప్రారంభించారు. ఏ బిసినెస్ లో అయినా నష్టాలు వస్తాయేమో గాని బంగారం బిజినెస్ లో మాత్రం నష్టాలు ఉండవు. అన్ని లాభాలే. అందుకే ఇండియాలో ఎన్ని నగల దుకాణాలు ఉన్నా సర్వైవ్ అవుతూనే ఉంటాయి. పదేళ్లకు పైగా సినిమా రంగంలో ఉన్నది కాబట్టి వచ్చిన డబ్బును బిజినెస్ లో పెడుతున్నది. ఇప్పటికే కాజల్ కు 36 ఏళ్ళు వచ్చాయి. ఎలాగైనా ఈ ఏడాది పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు చూస్తున్నారు. కాజల్ మాత్రం దాని గురించి ఆలోచించడం లేదు. బిజినెస్ ను డెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.