HomeTelugu Trendingసుశాంత్ మేనేజర్ దిశా మృతిపైనా దర్యాప్తు

సుశాంత్ మేనేజర్ దిశా మృతిపైనా దర్యాప్తు

Sushant former manager dish

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కొద్దిరోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 8న ముంబై మలాద్ లోని తన అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక పోలీసులు ప్రమాదవశాత్తు మరణించినట్టు కేసు నమోదుచేశారు. ఆమె మరణించిన అనంతరంసుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవటంతో దిశా మరణం పైనా అనుమానాలు మొదలయ్యాయి. దీంతో దిశ మరణంపైనా సమగ్ర దర్యాప్తు జరగాలని వారు భావిస్తున్నారు. ఆమె మృతి పై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసారు.

ఇప్పటికే ముంబై పోలీసులు ఆమె చుట్టుపక్కల వారి నుంచి దిశ మృతి పై సమాచారం సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం, ఆధారాలు తెలిసిన వారు ఎవరైనా తమకు ఆ వివరాలు అందచేయాలని ముంబై పోలీసులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దిశ ఆత్మహత్య చేసుకోలేదని ఇదివరకే బీజేపీ నేత నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుశా అంతకుందు ఆమెపై అత్యాచారం జరిగి ఉండవచ్చని కూడా సందేహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదికలో దిశా ఒంటిపై గాయాలు ఉన్నట్టు తేలిందన్నారు. దిశ మరణంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె తండ్రి దిశ సతీష్ సలియన్ మల్వాని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu