HomeTelugu Big Storiesమహేష్‌ భట్‌పై సుశాంత్‌ సింగ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

మహేష్‌ భట్‌పై సుశాంత్‌ సింగ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

14 4
బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుశాంత్ మరణంకు కొందరు కారణం అంటూ వారిని నెటిజన్స్ ట్రోల్స్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెల్సిందే. కరణ్ జోహార్.. సంజయ్ లీలా భన్సాలీ ఇంకా సల్మాన్ వంటి వారిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. తాజాగా మహేష్ భట్‌పై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సుశాంత్ మరణం వెనుక మహేష్ భట్ ప్రమేయం ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. రియా చక్రవర్తితో సంబంధం ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సుశాంత్ రియా చక్రవర్తి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. నవంబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు ఈ లోగా ఇలా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సుశాంత్ మరణం వెనుక మహేష్ భట్ పాత్ర ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మహేష్ భట్ కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పిన సంగతిని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ‘నువ్వు నాతో ఉంటే మహేష్ భట్ నన్ను చంపేస్తాడని రియాతో సుశాంత్ చెప్పినట్టు తెలుస్తోంది. వీటన్నింటిని సుశాంత్ ఫాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu