HomeTelugu Trendingనోపార్కింగ్‌ అంటున్న సుశాంత్‌

నోపార్కింగ్‌ అంటున్న సుశాంత్‌

1 22
స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్న సుశాంత్‌, తాజాగా హీరోగా కొత్త సినిమాను ప్రారంభించారు. ”ఇచ్చట వాహనాలు నిలపరాదు'(నో పార్కింగ్‌)’ అనే ట్యాగ్‌ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోపాటు మోషన్‌ పోస్టర్‌ను సుశాంత్‌ ట్విటర్‌ వేదికగా ఈరోజు విడుదల చేశారు. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రవి శంకర్‌ శాస్త్రి, హరీశ్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ జనవరి 2020 నుంచి ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu