HomeTelugu Trendingనయనతారతో పోటీపడుతున్న సుదీప్

నయనతారతో పోటీపడుతున్న సుదీప్

Nayanatara vs Sudeep

ఈగ సినిమాలో విలన్‌గా సుదీప్ నటన అద్భుతం. కన్నడలో పెద్ద స్టార్ అయిన సుదీప్ ఈగ సినిమాలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాడు. చాలా కాలం తర్వాత మళ్లీ నెగెటివ్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో సుదీప్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారట. లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందట నయనతార. డ్రీమ్ వారియర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజాగా నయనతార నటించిన నేత్రికన్ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. హర్రర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో అంధురాలిగా కనిపించబోతుంది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నయన తార ఇంకా రజనీకాంత్ మూవీ అన్నాత్తేలో నటిస్తోంది. విజయ్ సేతుపతితో కలిసి మరో చిత్రంలో నటిస్తోంది. నయనతార ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు అవుతున్నా ఇంకా వరుస సినిమాలతో బిజీ ఉంటూ తన సత్తాచాటుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu