ప్రేమలో రెజీనా-సందీప్‌ కిషన్‌!


టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాస్తవానికి వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు తాజాగా సందీప్ కిషన్ చేసిన ట్వీట్ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.

రెజీనా పుట్టిన రోజు సందర్భంగా సందీప్ ఈ ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే పాప. లవ్యూ. అన్ని విషయాలలో నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. స్టే బ్లెస్డ్’ అని సందీప్ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్న ఓ సెల్ఫీ ఫొటోను కూడా షేర్ చేశాడు. దీంతో, వీరి ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వీరిద్దరూ కలిసి ‘రారా క్రిష్టయ్య’, ‘నక్షత్రం’ చిత్రాల్లో నటించారు.

CLICK HERE!! For the aha Latest Updates