HomeTelugu Trendingఅలా పిలవొచ్చు కదా?: తాప్సీ

అలా పిలవొచ్చు కదా?: తాప్సీ

1 16
టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్‌లో తాప్సీ విభిన్నమైన స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ హిట్స్‌తో దూసుకెళ్తుంది. వరుస హిట్లతో అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ. ఇక ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుపుకునే ఫిలిం ఫేర్ వేడుక ఈ ఏడాది కూడా అదే స్థాయిలో జరిగింది. అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో 65వ ఫిల్మ్‌ఫేర్ వేడుక జరుగగా.. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన తారలందరూ హాజరయ్యారు. ఇక ఈ ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవంలో బాలీవుడ్ మూవీ ‘గల్లీబాయ్’ కి ఎక్కువ అవార్డులు దక్కాయి. దాంతో పాటు తాప్సీ నటించిన ‘సాంద్‌కీ ఆంఖ్‌’ సినిమాకు అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా నెటిజన్లు తాప్సీని అభినందిస్తూ .. ‘బాలీవుడ్‌ ఫీమేల్‌ ఆయుష్మాన్‌ ఖురానా’ అని ట్వీటర్‌లో కామెంట్ చేశారు. దానికి ”అలా అనేకంటే బాలీవుడ్‌ తొలి తాప్సీ అని పిలవొచ్చు కదా?” అని రిప్లై ఇచ్చింది తాప్సీ. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu