ద్విపాత్రాభినయంలో పవన్ కల్యాణ్.!


టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో బీజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై, అభిమానుల్లో అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత క్రిష్ డైరెక్షన్‌లో పవన్ ఒక సినిమా చేయనున్నాడు. ఇది చారిత్రక నేపథ్యంలో సాగే కథ. ఆంగ్లేయుల కాలంలో ఈ కథ నడుస్తుందట. ఈ కథలో పవన్ .. ఆంగ్లేయులను ఎదిరించే బందిపోటుగా కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

బందిపోటుగా మాత్రమే కాదు .. మరో విలక్షణమైన పాత్రలోను పవన్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. అంటే పవన్ ద్విపాత్రాభినయం చేయనున్నాడన్న మాట. పవన్ చేసే మరో పాత్ర ఎలా వుండబోతోంది? ఆ పాత్రను క్రిష్ ఎలా డిజైన్ చేశాడు? ఆ పాత్రలో పవన్ ఎలా కనిపించనున్నాడు? అనేవి ఆయన అభిమానుల్లో ఆసక్తిని పెంచే అంశాలనే చెప్పాలి. ఏప్రిల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావలసింది. కానీ కరోనా కారణంగా మే2వ వారం నుంచి స్టార్‌ అవుతుంది అని అంటున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates