HomeTelugu Trending'అల వైకుంఠపురములో' టబు లుక్‌..

‘అల వైకుంఠపురములో’ టబు లుక్‌..

7 3స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ టబు ఈ చిత్రం ద్వారా తెలుగు తెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. సోమవారం ‘టబు’ పుట్టినరోజు సందర్భంగా ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రబృందం ఈ సినిమాలోని ఆమె లుక్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

‘ఆమె చూపులు మన హృదయాలను కొల్లగొడతాయి. ఆమె టాలెంట్‌తో ఎవరినైనా ఆకట్టుకోగలదు. టబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో మరిన్ని చిత్రాలు చేయాలని మేము ఎదురుచూస్తున్నాం.’ అని చిత్రబృందం పేర్కొంది.

‘కూలీ నెం.1’ చిత్రంతో తెలుగు తెరకు టబు పరిచయమయ్యారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పాండురంగడు’ చిత్రంలో టబు నటించారు. 2008లో ఈ చిత్రం విడుదలయ్యింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu