చిరంజీవితో అనసూయ చిందులు


మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా ‘ఆచార్య’. ఈ చిత్రంలో చిరంజీవిని డిఫరెంట్ లుక్ తో .. పవర్ఫుల్ పాత్రలో చూపించనున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు.

ఇక చిరంజీవి – రెజీనా కాంబినేషన్లో ఒక ఐటమ్ సాంగ్‌ కూడా వుంది. ఇటీవలే ఈ పాటను 6 రోజుల పాటు చిత్రీకరించారు. సినిమాలో ఈ పాట ఇంటర్వెల్ కి ముందు రానున్నట్టు తెలుస్తోంది. ఇంటర్వెల్ తరువాత కూడా ఒక ప్రత్యేక సాంగ్ ను ప్లాన్ చేశారట. ఈ స్పెషల్ పాట కోసం అనసూయను తీసుకున్నట్టుగా సమాచారం. అనసూయ హాట్ హాట్ గా కనిపిస్తూ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయనుందని అంటున్నారు. ఈ ప్రత్యేక గీతం కోసం ఆమెకి భారీ పారితోషికమే ముట్టినట్టుగా వినికిడి.