Homeతెలుగు Newsఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి ఓటు హక్కును తొలగించాలి

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి ఓటు హక్కును తొలగించాలి

2 23యోగా గురువు బాబా రాందేవ్‌ జనాభా నియంత్రణపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే వారికి ఓటుహక్కు తొలగించాలని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘దేశంలో జనాభాను నియంత్రించాలంటే.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులకు ఓటు హక్కును తొలగించాలి. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు కూడా కల్పించకూడదు. అది హిందువులు, ముస్లింలు ఎవరైనా సరే. అప్పుడే జనాభాను నియంత్రించగలం’ అని బాబా రాందేవ్‌ అన్నారు.

కాగా.. రాందేవ్‌ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఒకరి కంటే ఎక్కువ మంది తోబుట్టువులు ఉండేవారికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించకూడదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఓటు హక్కును కూడా తొలగించాలంటూ ఆయన సూచనలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu