మిల్కీ బ్యూటీ తమన్నా 15 ఏళ్లుగా తన అందాలు.. అభినయంతో ఆకట్టుకుంటుంది. 50కి పైగా సినిమాల్లో నటించిన తమన్నా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో నటించిన తొలి సినిమా శ్రీ నుంచి ఇప్పటి వరకు తన గ్లామర్‌తో కెరీర్ లాగేస్తుంది. గతేడాది కూడా ఎఫ్ 2, విశాల్ యాక్షన్ లాంటి సినిమాల్లో బికినీ అందాలతో ఆకట్టుకుంది. హాట్ సీన్స్ చేయడం చేయకపోవడం మన యిష్టం అంటుంది తమన్నా. ఇక్కడ ఎవరూ మిమ్మల్ని హాట్ సీన్స్ చేయాలని.. ముద్దులు పెట్టాలని బలవంతం చేయరని.. అంతా మీ యిష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పింది ఈ బ్యూటీ. ఒకవేళ తన కెరీర్లో మాత్రం ముద్దు పెట్టాల్సిన పరిస్థితి వస్తే కచ్చితంగా దర్శకుడికి నో చెప్తానని క్లారిటీ ఇచ్చింది తమన్నా.
అయితే బాలీవుడ్‌లో హీరో హృతిక్ రోహన్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ముద్దు సీన్స్ చేయడానికి తనకేం అభ్యంతరం లేదని మిల్కీ బ్యూటీ చెప్తుంది. తాజాగా సమంత స్యామ్ జామ్ షోకు వచ్చిన తమన్నా అక్కడ చాలా విషయాలు చెప్పింది. ముఖ్యంగా నో కిస్సింగ్ పాలసీని ఏ హీరో కోసం పక్కనబెడతావ్ అంటూ విజయ్ దేవరకొండ అని
చెప్పుకొచ్చింది తమన్నా. ఆయనకు ముద్దులివ్వడానికి తనకేం ప్రాబ్లమ్ లేదంటుంది తమన్నా. ఓహో.. అయితే లిప్ లాక్ సీన్స్ చూడొచ్చన్నమాట అంటూ తమన్నాను ఆట పట్టించింది సమంత.