కాటమరాయుడు కొత్త లుక్!

పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కొన్నాళ్ళ క్రితమే రిలీజ్ చేశారు. ఆ లుక్ తో అభిమానులు పండగ చేసుకున్నారనే చెప్పాలి. ఇప్పుడు కొత్తగా ‘కాటమరాయుడు లుక్స్‌ సిరీస్‌’ షురూ చేశారు. ఈరోజు నుండి వరుసగా ‘కాటమరాయుడు’ లుక్స్‌ రిలీజ్‌ చేస్తారని సమాచారం. తాజాగా ఈ రోజు సినిమాకు సంబంధించిన ఓ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో పవన్‌కళ్యాణ్‌ ఫేస్‌ కనిపించనివ్వకుండా.. కాళ్ళు మాత్రమే చూపించారు.

ఇంకా సినిమాకు సంబంధించిన లుక్ రోజుకొకటి చొప్పున రిలీజ్‌ చేస్తారని చెబుతున్నారు. న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా సినిమా టీజర్‌ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. కిషోర్‌ కుమార్‌ పార్దసాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ తమిళ ‘వీరం’ సినిమాకి రీమేక్‌ గా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.