HomeTelugu Trendingమరోసారి రవితేజాతో తమన్నా‌!

మరోసారి రవితేజాతో తమన్నా‌!

4 15
టాలీవుడ్‌ మాస్‌మహా రాజా రవితేజ ప్రస్తుతం.. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ ఈ మూవీ తరువాత ‘రాక్షసుడు’ దర్శకుడు రమేశ్ వర్మతో కలిసి పని చేయనున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుతో నక్కిన త్రినాథరావు సిద్ధంగా వున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నాను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నాడట. దాదాపుగా ఆమెనే ఖరారు కావొచ్చని అంటున్నారు. ‘బెంగాల్ టైగర్’ తరువాత రవితేజతో తమన్నా జోడీ కడుతున్న చిత్రం ఇది. ఈ సినిమాలో రవితేజ లుక్ డిఫరెంట్ గా ఉంటుందనీ, తమన్నా పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu