HomeTelugu Trending‘తత్వమసి’ టైటిల్‌ పోస్టర్‌

‘తత్వమసి’ టైటిల్‌ పోస్టర్‌

Tatvamasi title poster re

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఇషాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘తత్వమసి’. కొత్త దర్శకుడు రమణ గోపిశెట్టి డైరెక్షన్‌ ఈ చిత్రం వస్తుంది. ఈ చిత్రం పోస్టర్‌ను గురువారం విడుదల చేస్తామని ఆయన ఇటీవల వెల్లడించారు. ఆయన చెప్పినట్లే విడుదలైన ‘తత్వమసి’ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, రాధాకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. నల్లటి బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీచక్రం. దాని మధ్యలో ‘తత్వమసి’ అనే అక్షరాలపై ఎర్రని మరకలతో ఉన్న ఈ పోస్టర్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆర్ఈఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu