HomeTelugu Trendingప్రభాస్‌ తో రెమాన్స్‌ చేయనున్న దీపికా పదుకొనె!

ప్రభాస్‌ తో రెమాన్స్‌ చేయనున్న దీపికా పదుకొనె!

4
టాలీవుడ్ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం ‘జాన్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కనున్న ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా పూజా హగ్దే నటిస్తుంది. జాన్ అనేది కేవలం వర్కింగ్ టైటల్ మాత్రమే సినిమా కోసం ఓ డియర్, రాధేశ్యామ్ అనే టైటిల్స్ ను రిజిస్టర్ చేయించారు. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రభాస్ తో నటించనున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ప్రభాస్ సరసన నటించనుందని సమాచారం. ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని అన్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. అందుకోసమే దీపికను ఎంపిక చేశారట ఇక దీపికా తో పాటు భారీ తారాగణం ఉండబోతుందని తెలుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu