HomeTelugu Big StoriesTDP-JANASENA FIRST LIST: టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల

TDP-JANASENA FIRST LIST: టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల

TDP Janasena list2

TDP-JANASENA FIRST LIST: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఈసారి ఏపీ ఎన్నికలు చాలా స్పెషల్. టీడీపీ-జనసేన కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనూ ఈ రెండు పార్టీలు పొత్తుతో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఓడించేందుకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అనేకచోట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు అన్ని వర్గాలు ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నాయి. వీటిని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు వెళ్తున్నాయి.

ప్రభుత్వంలోని అనేక వర్గాలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఒప్పంద కార్మికులు, ఆశావర్కర్లు, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. మరోవైపు నిరుద్యోగ సంఘాలు, రైతులు, అగ్రిగోల్డ్ బాధితులు ఇలా చాలా వర్గాల ప్రజలకు ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి.

అధికార పార్టీ వైసీపీని ఎలాగైనా ఓడించాలని వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ-జనసేన నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి వెళ్తున్నాయి. తప్పకుండా గెలుస్తామనే ధీమాలో టీడీపీ-జనసేన పార్టీలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్న చేస్తున్నాయి.

పొత్తులో భాగంగా ఏపీ ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభస్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో ప్రస్తుతం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను జనసేన ప్రకటించింది. టీడీపీ మాత్రం 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇవాళ మాఘ పౌర్ణమి సందర్భంగా మంచి ముహూర్తం చూసుకుని టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.

టీడీపీ-జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది. అయితే బీజేపీ నుంచి ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. దీంతో ఒకవేళ బీజేపీ గాని కలిసి వస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్, భావి తరాల కోసమే టీడీపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్టు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అన్నారు. మా కూటమికి బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని పవన్ అన్నారు.

జనసేన పోటీ అభ్యర్థులు: నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారు

list page 1list page 2

list page 3

Recent Articles English

Gallery

Recent Articles Telugu