రానాతో తేజ మూవీ!


ప్రముఖ దర్శకుడు తేజ ప్రస్తుతం రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ను ‘అహింస’ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమకథలు జోనర్లోనే తేజ ఈ సినిమాను రూపొందించాడు.

ఈ సినిమా తరువాత తేజ ప్రాజెక్టు ఏ హీరోతో ఉండనుందనే ప్రశ్నకి సమాధానంగా రానా పేరు వినిపిస్తోంది. రానా హీరోగా తేజ ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి ఆచంట గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

గతంలో తేజ – రానా కాంబినేషన్లో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా వచ్చింది. 2017లో వచ్చిన ఈ సినిమా విజయాన్ని సాధించింది. రానా కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతోంది. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న రానా, ఇకపై దూకుడు చూపిస్తాడేమో చూడాలి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates