HomeTelugu Newsతమిళ హీరోతో తేజ తెలుగు సినిమా..!

తమిళ హీరోతో తేజ తెలుగు సినిమా..!

8 24దర్శకుడు తేజ కొత్త వాళ్లతో చేసిన ప్రయోగాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని అనుకున్నా ఏదో ఒక ఆటంకం ఎదురౌతూనే ఉంది. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని కొత్తగా వచ్చే నటులకు కమిట్ అవుతున్నాడు. తేజ.. రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ కావడంతో హీరోలు తేజ వైపు చూసినా.. పెద్దగా లాభంలేకపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ ను మొదలు పెట్టిన ఆ సినిమా ప్రారంభం కాకముందే తప్పుకోవాల్సి వచ్చింది. అటు వెంకటేష్ తో మొదలుపెట్టిన సినిమా కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తేజ.. బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమా తరువాత తేజ.. తమిళ హీరో విశాల్ ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. విశాల్ తమిళంలో చేసిన సినిమాలు తెలుగులోను పెద్దహిట్ అయ్యాయి. తెలుగులో మంచి పేరున్నా.. ఇప్పటి వరకు స్ట్రెయిట్ మూవీ చేయలేదు. విశాల్ ను తెలుగుకు పరిచయం చేసే భాద్యతను తేజ తీసుకున్నట్టు తెలుస్తోంది. తేజ చేస్తున్న సీత సినిమా పూర్తయ్యాక విశాల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu