HomeTelugu Trending'సర్కస్‌ కార్‌-2'లో తేజస్వి మదివాడ

‘సర్కస్‌ కార్‌-2’లో తేజస్వి మదివాడ

Tejaswi madivada in circus
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సర్కస్‌ కార్‌-2’.నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్‌లో రూపొంది మంచి విజయం సాధించిన “సర్కస్ కార్”కి సీక్వెల్ ఇది. ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘తేజస్వి మదివాడ’ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ… ‘నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్ లో వచ్చిన “సర్కస్ కార్” చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిత్రం సీక్వెల్ లో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సీక్వెల్ స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ‘సర్కస్ కార్-2’లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత శివరాజ్ గారికి థాంక్స్’ అన్నారు.

Tejaswi madivada 1

ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ… ‘సర్కస్ కార్’ సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్… ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు… వాటి పరిణామాలు పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే ‘సర్కస్ కార్-2’ మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్ కి మరింత మంచి పేరు తెస్తుంది. పిల్లల నటన, ఆషు రెడ్డి-గ్లామర్ ‘సర్కస్ కార్-2’కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి’ అన్నారు. బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చైతన్య సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu