సంగీత్‌లో అర్చన ఆటపాట

టాలీవుడ్‌ నటి అర్చన(వేద) పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి సంగీత్‌ కార్యక్రమం నిర్వహించారు. బంధు మిత్రులతో పాటు వధువు, వరుడు హుషారుగా నృత్యాలు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వధూవరులకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు.

ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ భక్తవత్సలంతో 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు హైదరాబాద్‌లో అర్చన వివాహం జరగనుంది.13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ ఉంటుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

అల్లరి నటించిన ‘నేను’ చిత్రం తో 2004లో ఎంట్రీ చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. సరైన విజయం దక్కపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-1 కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రతిభ చాటుకుంది. టీవీల్లో పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.