HomeTelugu Trendingజయలలితగా కంగనా షాకింగ్‌ లుక్‌

జయలలితగా కంగనా షాకింగ్‌ లుక్‌

5 21తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అమ్మ లుక్‌లో నటి కంగనా రనౌత్‌ ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో కనిపించారు. పచ్చచీరలో అభివాదం చేస్తున్న బ్యానర్‌ను ఈ తొలి ప్రచార చిత్రంలో చూపించారు. అయితే పోస్టర్‌లో ఉన్నది కంగన అని గుర్తు పట్టడానికి చాలా సమయం పట్టడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్టర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పాత్ర కోసం కంగన పడ్డ శ్రమ పోస్టర్‌లో కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు యూనిట్‌ ఈ సందర్భంగా ప్రకటించింది. ‘ఈ లెజెండ్‌ మనందరికీ తెలుసు. కానీ ఆమె కథ అందరికీ ఇంకా చెప్పాల్సి ఉంది’ అని టీం పేర్కొంది.

తలైవి’ సినిమా కోసం దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ దాదాపు తొమ్మిది నెలలపాటు పరిశోధనలు చేశారు. ఆమె జీవితం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జయలలితగా కంగన నటిస్తుండగా.. ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ సినిమాను నిర్మిస్తున్నారు.

5a 2

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu