HomeTelugu Big Storiesతెలుగు బిగ్‌బాస్‌లో హోస్ట్‌ మార్పు?

తెలుగు బిగ్‌బాస్‌లో హోస్ట్‌ మార్పు?

3 29

తెలుగు బిగ్‌బాస్‌ ఆరో వారాంతంలో రాజమాత శివగామి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనుంది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నాగార్జున విదేశాల్లో ఉండటంతో ఈ వీకెండ్‌ను ఓ స్పెషల్‌ గెస్ట్‌చే నిర్వహిస్తారనే వార్తలు వైరల్‌ అయినా.. అవన్నీ రూమర్సే అని కొట్టిపారేశారు. చివరకు అవే నిజమయ్యాయి. బిగ్‌బాస్‌ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్‌లో హోస్ట్‌గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ సిద్ధం అయింది. మొదటిసారిగా బిగ్‌బాస్‌ రియాల్టీ షోను మహిళా వ్యాఖ్యాత నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా అభిమానులతో పంచుకుంది. ఈ వీకెండ్‌ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌ ఉండబోదని మరో టాక్‌ వినిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఏరేంజ్‌లో ఉంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu