HomeTelugu Big Storiesఅన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే: మహేష్‌ బాబు ప్రోమో

అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే: మహేష్‌ బాబు ప్రోమో

Unstoppable with nbk mahesh

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ వ్యవహారిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్‌ ఫినాలేకు అడుగుపెట్టింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చివరి ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు.

దీనికి సంబంధించిన ప్రోమోను సైతం ఆహా విడుదల చేసింది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందో అతడే మహేశ్‌ అంటూ బాలయ్య తనదైన స్టయిల్‌లో మహేశ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా సాగిన సంభాషణ ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu