‘స్పైడర్’కి 125 కోట్లు అంతా ఉత్తిదేనా..?

‘స్పైడర్’ సినిమాకు 125 కోట్ల వరకు బడ్జెట్ అయిందని చిత్రనిర్మాతలు వెల్లడించారు. తెలుగు,తమిళ భాషల్లో రూపొందిన సినిమా, వీఎఫ్ఎక్స్, యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉంది. రెమ్యూనరేషన్స్ పరంగా ఎక్కువ మొత్తం అవుతుంది కాబట్టి ఆ మాత్రం బడ్జెట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ తెరపై అంత ఆర్భాటాలు ఏవి కనిపించలేదు. సినిమా చూసిన
వారంతా.. కూడా 125 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మహేష్ ఇల్లు, ఆఫీస్ లకు సెట్ వేయాల్సి వచ్చింది. యాక్షన్ సన్నివేశాలకు, విజువల్ ఎఫెక్ట్ ను భారీగా ఖర్చు పెట్టామని అన్నారు. కానీ ఆ క్వాలిటీ తెరపై ఎక్కడా కనిపించలేదు.
మహేష్, మురుగదాస్ ల రెమ్యూనరేషన్ ఓ నలభై కోట్ల వరకు అయి ఉంటాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కోసం మరో పది కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. అంటే సినిమా మేకింగ్ కు 70 కోట్ల వరకు అయ్యాయన్నమాట. అదంత నమ్మశక్యంగా లేదు. సినిమాను ఎక్కువ రేటుకి అమ్మడం కోసమే ఇలాంటి లెక్కలు చెప్పారని అంటున్నారు.