HomeTelugu Big Storiesత్వరలో తెలుగు బిగ్‌బాస్‌-3.. హోస్ట్‌ ఎవరో?

త్వరలో తెలుగు బిగ్‌బాస్‌-3.. హోస్ట్‌ ఎవరో?

5
బిగ్‌బాస్ అభిమానులకు శుభవార్త ఇది. తెలుగులో బిగ్‌బాస్ రెండు సీజన్‌లు విజయవంతంగా ముగిశాయి. ఇప్పుడు మూడో సీజన్‌ మొదలయ్యేందుకు సిద్ధమవుతోంది. బిగ్‌బాస్-1 కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. రెండో సీజన్‌లో మసాలా అంటూ, ఏమైనా జరగొచ్చంటూ అంచనాలు పెంచారు. కానీ అనేక విమర్శలు వచ్చాయి. రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా పరవాలేదనిపించినా సీజన్‌కు వచ్చినంత క్రేజ్ తేలేక పోయారని, సోషల్ మీడియాలో పలు విమర్శలు ఎదుర్కొన్నారు నాని. సభ్యుల సెలెక్షన్స్ కూడా సరిగా లేదనే వాదనలూ వినిపించాయి. తొలి సీజన్‌కు వచ్చినంత రేటింగ్‌ రెండో సీజన్‌కు రాకపోయినా పర్వాలేదనిపించారు.

మూడో సీజన్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా ముందుగా జాగ్రత్తపడుతున్నారట. బిగ్‌బాస్ మూడో సీజన్‌ కోసం హోస్ట్‌ స్థానంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, సీనియర్ హీరో వెంకటేష్ పేర్లు వినిపిస్తున్నాయి. వెంకటేష్‌ అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరగా ఉంటారని బిగ్‌ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట అందుకే వెంకటేష్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. జూన్‌ నుంచి బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్‌ ప్రారంభించే అవకాశముంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu