HomeTelugu Trendingమంచి మనస్సు చాటుకున్న పూరీ

మంచి మనస్సు చాటుకున్న పూరీ

3 26డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్.. ఓ మంచి పని చేసి ఔరా పూరీ అనిపిస్తున్నాడు. రేపు తన పుట్టిన రోజు సందర్భంగా 20 మంది ద‌ర్శకులు, కో డైరెక్టర్లకు ఆర్ధిక‌ సాయం చేయనున్నట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పూరీ.. అన్నీ అనుకూలిస్తే ప్రతి ఏడాది ఇలానే సాయం చేస్తాన‌ని అన్నాడు. సినిమాతో మ‌మేక‌మై ఉండే ప్ర‌తి ఒక్కరి జీవితం బాగుండాల‌ని భావించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో తెలిపాడు. ఇదేమీ పెద్ద సహాయం కాదని, నిరుత్సాహంలో ఉన్న వాళ్లకు చిన్న చిరునవ్వులాంటి పలకరింపు అని పేర్కొన్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. ఒకప్పుడు సినిమా కోసం తమ జీవితాన్ని అంకింతం చేసి, నేడు పని లేక కష్టాలు పడుతున్న కొందర్ని చూసి ఎంతో బాధ కలిగిందని, అయితే వారికి మంచి జరగాలని దేవుడ్ని ప్రార్థించడం కన్నా, తోచినంత సాయం చేయడం మంచిదన్న ఉద్దేశంతో ఈ పని మొదలు పెడుతున్నామని పూరి, చార్మి తెలిపారు. దేవుడు కరుణిస్తే ప్రతి ఏడాది ఇలాగే సాయం చేస్తామని, తమ ఈ చిన్న సాయం కష్టాల్లో ఉన్నవాళ్లకు ఏ కాస్త ఊరటనిచ్చినా తమ ప్రయత్నం సఫలమైనట్టేనని లేఖలో వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu