HomeTelugu News'యన్‌.టి.ఆర్'లో తెలుగు అమ్మాయి!

‘యన్‌.టి.ఆర్’లో తెలుగు అమ్మాయి!

హీరో బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘యన్‌.టి.ఆర్’‌. ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో పాటు శ్రీదేవిగా రకుల్ ప్రీత్‌ సింగ్‌, జయసుధ పాయల్‌ రాజ్‌పుత్, కృష్ణకుమారిగా మాళవిక నాయర్‌, సామిత్రిగా నిత్యా మీనన్‌, ప్రభగా శ్రియ,‌ జయప్రధ హన్సికలు నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

4 5

తాజాగా ఈ లిస్ట్‌లో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కూడా చేరింది. యన్‌టిఆర్‌లో ఈషా కూడా నటించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య, ఈషా కాంబినేషన్‌లో పలు సన్నివేశాలు చిత్రీకరించారట. అయితే ఈషా ఎవరి పాత్రలో కనిపించనుందన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం యన్‌టిఆర్‌ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu