రష్మిక కోసం క్యూ కడుతున్న యంగ్‌ హీరోలు..!

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ‘గీత గోవిందం’ సినిమాకు ఏకంగా వంద కోట్ల వసూళ్లు రావటంతో రష్మిక కూడా లక్కీ గర్ల్‌ అన్న ముద్ర పడిపోయింది. అందుకే యంగ్ హీరోలు, దర్శకులు రష్మిక కోసం క్యూ కడుతున్నారు.

తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రష్మికను ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. నితిన్‌ హీరోగా భీష్మా పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు కూడా రష్మికనే హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట వెంకీ. ప్రస్తుతం ఈ భామ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ‘దేవదాస్‌’తో పాటు విజయ్‌ దేవరకొండతో మరోసారి జోడిగా ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో నటిస్తుంది.