HomeTelugu Trendingనంది అవార్డులతో మాకు సంబంధం లేదు: టీఎఫ్‌సీసీ

నంది అవార్డులతో మాకు సంబంధం లేదు: టీఎఫ్‌సీసీ

tfcc announcement on nandia
దుబాయ్‌లో జరగనున్న నంది అవార్డుల వేడుకపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో దుబాయ్ వేదికగా నంది అవార్డుల ఫంక్షన్‌ను ప్రకటించారు. అయితే ఇక్కడ నిర్వహించే ఈ కార్యక్రమంతో ఫిల్మ్ ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నంది అవార్డుల పేటెంట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పేరు మీదే ఉందన్న టీఎఫ్‌సీసీ.. ఆ అవార్డుల వేడుకలపై తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు విచారణ జరపాలని కోరింది.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ప్రభుత్వ అనుమతి లేదని వెల్లడించింది. దీనిని ఓ ప్రయివేటు సంస్థగా తెలిపింది. ఒక వ్యక్తి ఇలా నంది అవార్డులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. దుబాయ్‌లో జరగనున్న ఈ అవార్డు వేడుకలపై ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు విచారణ జరపాలని టీఎఫ్‌సీసీ విజ్ఞప్తి చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu