HomeTelugu Trendingఆసక్తికర టైటిల్‌తో నాగశౌర్య

ఆసక్తికర టైటిల్‌తో నాగశౌర్య

Naga shaurya next movie tit 1

టాలీవుడ్‌ యువ నటుడు నాగశౌర్య సంతోష్‌ జాగర్లపూడి డైరెక్షన్‌లో ఓ మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి ‘ల‌క్ష్య’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఈ రోజు సాయంత్రం 5:04 నిమిషాల‌కు స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని రిలీజ్‌ చేసింది మూవీయూనిట్‌. ఈ పోస్ట‌ర్‌లో నాగ‌శౌర్య సూపర్ ఫిట్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు విలక్షణ పాత్రలో న‌టిస్తున్నారు.

నాగ‌శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. ‘ది గేమ్ విల్ నెవ‌ర్ బీ ద సేమ్’ అంటూ ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్ నెటిజన్ల చేత ప్రశంసలు అందుకుంది. ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తుండగా.. సంతోష్‌ జాగర్లపూడి కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Naga Shaurya (@actorshaurya)

Recent Articles English

Gallery

Recent Articles Telugu