HomeOTTThalavan: బిజూ మీనన్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటిటిలో

Thalavan: బిజూ మీనన్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటిటిలో

Thalavan: బిజూ మీనన్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటిటిలో
Thalavan: బిజూ మీనన్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటిటిలో 

బిజూ మీనన్ ప్రధాన పాత్రలో నటించిన Thalavan సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.

Thalavan OTT:

మలయాళంలో హిట్ అయిన పోలీస్ డ్రామా తలావన్ సెప్టెంబర్ 10న ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానుంది. కేరళలోని ముఖ్యమైన పండుగ అయిన ఓణం సందర్భంగా ఈ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

తెరపై విడుదలైనప్పుడు తలావన్ మంచి రెస్పాన్స్ పొందింది. ప్రత్యేకంగా ఈ సినిమాకి ఉన్న మంచి నిర్మాణ విలువలు, నటీనటుల శక్తివంతమైన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రొమాంటిక్ కామెడీలతో గుర్తింపు పొందిన జిస్ జాయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇది ఆయన కొత్త శైలిలోకి మారిన ప్రాజెక్ట్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను అరుణ్ నారాయణ్ ప్రొడక్షన్స్, లండన్ స్టూడియోస్‌తో కలిసి సిజో సెబాస్టియన్ నిర్మించారు.

మొదటిసారి రచయితలుగా పనిచేసిన ఆనంద్ థేవర్కట్, శరత్ పెరుంబవూర్ ఈ సినిమా స్క్రీన్‌ప్లే రాశారు. ఈ చిత్రానికి శరణ్ వెలయుధన్ సినిమాటోగ్రఫీ, దీపక్ దేవ్ సంగీతం అందించారు. ఎడిటింగ్ సూరజ్ ఈ ఎస్ నిర్వహించారు.

ఈ చిత్రంలో బిజు మీనన్, అసిఫ్ అలీ ముఖ్య పాత్రల్లో నటించారు. వీరిద్దరూ తమ కెరీర్‌లో మంచి విజయాలు సాధించిన నటులు కావడంతో వారి నటనపై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే, దీపక్ దేవ్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. జిస్ జాయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ కథను సృష్టించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

అయితే, ఇలాంటి పోలీస్ కథలు ఇప్పటికే చాలానే రావడం వల్ల తలావన్ హిట్ అవ్వాలంటే.. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండాలి. మరి బుల్లితెరపై తలవన్ ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!