HomeTelugu Trending'ఇండియన్ ఐడల్'కు జడ్జ్‌గా థమన్!

‘ఇండియన్ ఐడల్’కు జడ్జ్‌గా థమన్!

 

Thaman as judge for telugu
తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో క్రేజీ రియాలిటీ షోల జాబితాలో మరో పాపులర్ షో కూడా చేరబోతున్న విషయం తెలిసిందే. తెలుగు భాషలో పాపులర్ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ ను ప్రసారం చేయబోతున్నారు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. ఈ షోకు హోస్ట్ గా సింగర్ శ్రీరామ చంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత, ఎల్‌వి రేవంత్‌ కూడా ఈ షోలో కన్పించబోతున్నాడు. అయితే ఈ షోకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

S Thaman As Judge For Telugu Indian Idol Show - Sakshi

సింగింగ్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ లో ఓ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జడ్జ్ గా కన్పించబోతున్నారట. ఈ పాపులర్ షోలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాజిక్ ఉంటుందని అంటున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ షోకు జడ్జిగా వ్యవహరించబోతున్నారు అనే టాక్ నడుస్తోంది. థమన్ ను మేకర్స్ దాదాపు కన్ఫర్మ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థమన్ వరుస సినిమాలతో టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘అఖండ’ చిత్రం విజయ సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu