HomeTelugu Trendingప్రభాస్‌- మారుతి మూవీ అప్డేట్‌

ప్రభాస్‌- మారుతి మూవీ అప్డేట్‌

Prabhas Maruthi Movie Upda
పాన్‌ ఇండియా హీరో ప్ర‌భాస్ నటించిన ‘సలార్‌’ మూవీ ఇటీవలే విడుదలై సూపర్‌ హిట్‌ అయింది. 500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ప్ర‌భాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాకి కెజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

తాజాగా ప్రభాస్‌- డైరెక్టర్‌ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై శుక్ర‌వారం మేక‌ర్స్ బిగ్ అప్ డేట్‌ను రివీల్ చేశారు. సంక్రాంతికి ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌భాస్ లుక్‌ను షాడోలో చూపిస్తూ ఓ మ‌ల్టీ క‌ల‌ర్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌అవుతుంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రిత‌మే ప్రారంభ‌మైంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భాస్‌, మారుతి మూవీకి సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. ప్ర‌భాస్ మిన‌హా నటీనటుల గురించి ఇప్పటి వరుకూ ఎలాంటి అప్డేట్‌ లేదు.

సంక్రాంతి రోజు టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌తోనే అన్నింటిపై ఒకేసారి మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌బోతున్నారు. ప్ర‌భాస్‌, మారుతి మూవీకి ‘రాజా డీల‌క్స్’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేస్తున్నట్లు గతకొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు. మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న‌ట్లు టాక్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu