‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’.. టీజర్‌.. రాజమండ్రి అమ్మాయిగా తమన్నా

ప్రముఖ నటి తమన్నా నటిస్తున్న సినిమా ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’. హిందీ సూపర్‌ హిట్‌ ‘క్వీన్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి మను కుమారన్‌ నిర్మాత . అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. కాగా సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో తమన్నా రాజమండ్రి అమ్మాయి పాత్రలో కనిపించారు.

‘నా పేరు మహాలక్ష్మి.. నేను నా హనీమూన్‌కు వచ్చాను’ అంటూ తమన్నా తనను తాను పరిచయం చేసుకుంటున్న డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘రాజమండ్రిలో ఒక బ్రిడ్జ్‌ ఉంటది. ఆ బ్రిడ్జ్‌ను ఇలాగ నిల్చోబెడితే మీ ఈఫిల్‌ టవర్‌ ఉందికదా.. అది ఉడతలాగా ఉంటది’ అంటూ రాజమండ్రి అమ్మాయి యాసలో తమన్నా చెప్పే మాటలు నవ్వులు పూయిస్తున్నాయి.

‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’లో శివానీ దండేకర్‌, సంజయ్‌ స్వరూప్‌, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘క్వీన్‌’ తమిళ వెర్షన్‌లో కాజల్‌ నటిస్తున్నారు. ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ అనే టైటిల్‌తో దీన్ని విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ రీమేక్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయ