
ఆంధ్రులు ద్రావిడుల సంతతి. అభిమానానికి, పట్టుదలకు ద్రావిడులు ప్రతీక. గత తరం ఆంధ్రులు కూడా ఇది నిజమే అని రుజువు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ తెలుగు వాడి పొలిటికల్ దెబ్బను పాన్ ఇండియా వైడ్ గా గట్టిగా చూపించాడు. మరి ఈ తరం ఆంధ్రులకు ఏమైందీ ?, ఏమైపోయాయి ఆ పౌరుషాలు ?, ఏమైపోయాయి ఆ పంతాలు ?, చీము నెత్తురు లేని మాంసపు ముద్దల్లా మన ఆంధ్రులు మారిపోతారని మన పూర్వీకులు భావించి ఉండి ఉంటే.. కచ్చితంగా ఈ తరానికి వాళ్ళు అడుగులు వేసే వారు కాదేమో.
ఒకప్పుడు ఎంతో తెలివైన వారిగా ఆంధ్రులకు గుర్తింపు ఉండేది. ఇప్పుడు మాత్రం ఆంధ్రులు మూర్ఖులుగా ముద్ర పడిపోతున్నారు. దీనికి ఎవరు బాధ్యులు ?, ఒకపక్క ఆంధ్ర రాష్ట్రం నాశనం అవుతుంటే.. ఆంధ్రులు మాత్రం మౌన వ్రతం చేస్తున్నారు. దీనికి ఎవర్నీ నిధించాలి ?, ఆంధ్రలో రాజకీయాలు ఎంత దారుణంగా తయారైనా, ఆంధ్ర ప్రజల పై ఎన్ని రకాల దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్నా.. ఆంధ్రా ప్రజలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటాన్ని ఎలా జీర్ణించుకోవాలి ?..ఇలాంటి పరిస్థితిని రాజనీతి శాస్త్రంలో’ ‘పోనిస్తిజమ్’ అంటారు అని ఓ పెద్ద మనిషి చెప్పాడు.
అది పోనిస్తిజమో.. లేక శాడిజమో.. ఒక్కటి మాత్రం నిజం. ఇది ఆంధ్రప్రదేశ్ కి పట్టిన దుర్గతి. అందునా కొన్ని ఏరియాల్లో మరీ దారుణం. ఎన్ని దారుణాలు జరుగుతున్నా సరే.. మనకెందుకు? అనే భావన నేటి ఆంధ్రుల్లో బాగా ఇంకిపోయింది. ఆంధ్రా ప్రజల దృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకడు వచ్చి, మరొకని కొడతాడు. దెబ్బ తిన్న అతను తిరగబడతాడు. చివరికి ఇద్దరూ దెబ్బలాడతారు. ఆంధ్రా ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అంటే.. ‘ఇద్దరూ కొట్టుకున్నారు” అంతేగానీ తగువుకు మూలకారకుని తప్పుపట్టరు. ఈ విషయంలోనే జగన్ రెడ్డి ఇంకా కొన్ని వర్గాల ప్రజలను నమ్మించగలుగుతున్నాడు.
ఆంధ్రా రాజకీయాలలో ఒకప్పుడు అవగాహన ఎక్కువ ఉండేది. బహుశా అప్పుడు ఇన్ని ఛానెల్స్, పేపర్లు, వెబ్ సైట్లు లేవు కదా. ఇప్పుడు ఓ వార్త ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. ఆంధ్రా ప్రజల దృష్టి కూడా ఇలాగే తయ్యారు అయ్యింది. ఏది ఏమైనా ఆంధ్రలో రాజకీయాలు దారుణంగా తయారవ్వడానికీ ముఖ్య కారణం ఒక్కటే. ఆంధ్రుల్లో ఇప్పుడు రాజకీయ చైతన్యం లేకపోవటం. అలాగే, జగన్ రెడ్డి అన్యాయం పై స్పందిస్తే మనకేం ప్రమాదమో! ” అనే భయం కూడా ప్రజలను ఇలా స్తబ్దులుగా ఉంచుతుంది. కానీ, దైర్యమే ప్రగతికి సోపానం. కాబట్టి ఆంధ్రుల్లారా దైర్యంగా తిరగబడండి.












