బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ‘ది డర్టీ పిక్చిర్’లో విద్యాబాలన్‌తో కలిసి నటించిన ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించింది. ఆమె ఇంటి పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా బెనర్జీ ఎంతకీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న కోల్‌కతా పోలీసులు తలుపులు పగలకొట్టి చూడగా బెడ్‌పై బెనర్జీ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. అయితే నటి ముఖంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే కొద్ది కాలంగా బెనర్జీ కలకత్తాలో ఒంటిరిగా జీవిస్తున్నారని ఆమె పనిమనిషి పోలీసులకు తెలిపింది. దీంతో పనిమనిషి అందిచిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెనర్జీది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు. బెనర్టీ మరణ వార్తపై బాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’లో షకీలా పాత్ర పోషించారు.













